Gold Prices: మళ్లీ పెరిగిన పసిడి.. తులం ఎంతంటే.? 1 y ago
8K News-19/03/2025 ఈ మధ్యకాలంలో బంగారం ధరలు బాగా పెరుగుతున్నాయి. ప్రపంచ ఆర్థిక సంక్షోభాలు, భారీ పన్నుల పెరుగుదల, యుద్ధ పరిస్థితుల కారణంగా పసిడి విలువ బాగా పెరిగింది. ఇవాళ (బుధవారం) 10 గ్రాముల బంగారంపై ₹400 పెరిగింది. హైదరాబాద్, విజయవాడ నగరాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.82,900 ఉండగా.. అదే 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.90,440 వద్ద పలుకుతోంది. ఇక వెండి విషయానికి వస్తే వెయ్యి రూపాయలు పెరిగి కేజీ వెండి ధర రూ.1,14,000 కు చేరింది.